నటన ఎలా ఉండాలో...ఈ ఒక్కసీన్ చూస్తే చాలు
Actor ProfileActor

నటన ఎలా ఉండాలో...ఈ ఒక్కసీన్ చూస్తే చాలు

Total News1
Movie Updates0
Sources1
నటన ఎలా ఉండాలో...ఈ ఒక్కసీన్ చూస్తే చాలు
HMTV17 Jun 2026
నటన ఎలా ఉండాలో...ఈ ఒక్కసీన్ చూస్తే చాలు

Drishyam: కెమెరా ముందుకు వెళ్లనంత వరకు ఒకలా కనిపించే నటులు...కెమెరా ముందుకు వెళ్లి యాక్షన్‌ అనగానే...చేస్తున్న పాత్రలో...వస్తున్న సీన్‌లో పూర్తిగా నిమగ్నమౌతారు. హీరోలు, నటులు కనిపిస్తే చేస్తున్న పాత్ర ఫెయిల్‌ అయినట్టే..నటుడిగా ఏమాత్రం పనికిరారని తేలిపోతుంది. ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు ఓ సందర్భంగా చుక్కల్లో చంద్రుడు సినిమాలో సిద్ధార్థతో చెప్పారట. నటిస్తున్నామనే భావన ప్రేక్షకుడికి కలగకూడదు. సాధారణ ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేయగలిగితే నటుడిగా వందశాతం విజయం సాధించినట్టేనని చెప్పారట. నటన ఎలా ఉండాలో తెలియాలంటే దృశ్యం సినిమాలోని ఒక్క క్లైమాక్స్‌ సీన్‌ చాలని అంటున్నారు సినీ పండితులు. దృశ్యం క్లైమాక్స్‌... మోహన్‌లాల్‌ నుంచి రవిచంద్రన్‌ వరకు సినీ ప్రేక్షకులపై భారీగా ప్రభావం చూపిన సినిమా దృశ్యం. ఒక సాధారణ కుటుంబంలో కొంతమంది వలన ఇబ్బందులు ఎదురైతే... తన వారిని కాపాడుకోవడానికి ఆ తండ్రి ఏం చేశాడు అన్నదే సినిమా. కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, బలమైన కథనాలు, అంతకు మించిన నటన ఈ క్రైమ్‌ సినిమాను అన్ని భాషల్లో రీమేక్‌ అయ్యేలా చేసింది. మొదట ఈ సినిమాను మళయాలంలో తీశారు. మళయాలంలో మోహన్‌లాల్‌ నటించాడు. నటించాడు అని చెప్పడం కంటే జీవించాడనే చెప్పాలి. క్లైమాక్స్‌ సీన్‌లో మోహన్‌లాల్‌ ముఖంలో పెద్దగా పశ్చాత్తాపం కనిపించదు. నా కుటుంబాన్ని రక్షించడానికి ఎంతకన్నా తెగిస్తాను. దయచేసి నన్ను ఊరికనే మీ కొడుకు శవం గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి అని చేతులు ఎత్తి దణ్ణం పెడతాడు. ఆయన ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ పెద్దగా కనిపించవు. పశ్చాత్తాపం ఉండదు. ఇదే సీన్‌ని తెలుగులో వెంకటేష్‌ చేసినపుడు ఎలా మారిందో చూడండి. వెంకటేష్‌కి కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించదు. ఎంతవరకైనా వెళ్తానని చెప్పడు. కానీ, అంతకంటే... తన ముందున్న వారిని బాధించాననే బాధ అతని ముఖంలో కనిపిస్తుంది. ఇదే క్లైమాక్స్‌లో కమల్‌ హాసన్‌ నటన మరో లెవల్‌కి తీసుకెళ్లింది. తన కళ్లల్లో, మొహంలోనూ పశ్చాత్తాపంతో పాటుగా, అనుకోని పరిస్థితుల్లో ఒక