కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తూ ఉండటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్మస్థల ఆలయం వివాదంలో కీలకంగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ప్రకాష్ రాజ్ పేరు ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలో ప్రకాష్ రాజ్ భాగస్వామ్యం కావటం సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశం మీద ప్రకాష్ రాజ్ వెంటనే స్పందించాలని.. హిందువులకు క్షమాపణలు చెప్పి, కుట్ర వెనుక ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. "కోట్లమంది హిందువుల ఆరాధ్య దైవం ధర్మస్థలం మీద జరిగిన కుట్రలో ప్రకాష్ రాజ్ నేరుగా భాగస్వామ్యం కావటం సిగ్గుచేటు. ప్రకాష్ రాజ్ ఎక్కడికి పారిపోయారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో అందరినీ ప్రశ్నించే నువ్వు.. ఇంత పెద్ద కుట్రకోణంలో ఏ రకంగా ఇరుక్కున్నావ్. ఆ కుట్రకోణానికి బాధ్యులైన చిన్నయ్యతో మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? కర్ణాటక పోలీసులు మీ కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడికి పారిపోయారు? ప్రజాస్వామ్యం మీద నీకు విశ్వాసం ఉంటే తక్షణం బయటకు రావాలి." అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు." కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, డీకే శివకుమార్ ప్రకాష్ రాజ్‌ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు. అన్ని విషయాలలో తలదూర్చే ప్రకాష్ రాజ్.. హిందువుల మీద, హిందూసంస్థల మీద, దేవాలయాల మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరు? వెంటనే ప్రకాష్ రాజ్‌ను అరెస్ట్ చేయాలి. ప్రకాష్ రాజ్ స్వచ్ఛందంగా ముందుకువచ్చి హిందువులను క్షమాపణ చెప్పాలి. వెనుక ఉన్న కుట్రదారులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వీడియో విడుదల చేశారు.మరోవైపు ధర్మస్థలలో వందల మృతదేహాలను
Actor ProfilePolitician
ధర్మస్థల వివాదం.. ప్రకాష్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. బీజేపీ నేత డిమాండ్
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•13 Jun 2026
ధర్మస్థల వివాదం.. ప్రకాష్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. బీజేపీ నేత డిమాండ్