
కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది దసరా సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది దసరా సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాలపైనే పడింది. విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ ( Jailer 2) షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం అందరికీ విదితమే. నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పటికే తొంభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుని ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, ఆ డీల్ కూడా దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. ఈ యాక్షన్ సీక్వెల్‌లో మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో సందడి చేయనున్నారు. వచ్చే వారం నుంచే హృతిక్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా సవ్యంగా జరిగితే ‘జైలర్ 2’ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత అట్టహాసంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రజనీకాంత్ స్టైల్, నెల్సన్ టేకింగ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ మాజీ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ (Dhanush) కూడా అదే దీపావళి రేసులోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రం ఓం సినిమాకు ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ మెగాస్టార్