దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో
Actor ProfilePolitician

దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో, 1500 ఎకరాల్లో ప్రాజెక్ట్
Samayam Telugu20 Jul 2026
దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో, 1500 ఎకరాల్లో ప్రాజెక్ట్

డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ డిజిటల్ పటంలో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక డేటా సెంటర్ సిటీ స్థాపనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు శివారులో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయి హైపర్‌స్కేల్ డేటా నిర్వాహకులను ఆకర్షించేలా, పర్యావరణ అనుకూలమైన స్థిరమైన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరాతో ఈ సిటీని డిజైన్ చేస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత డేటా సెంటర్ సిటీకి అవసరమైన నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని గుర్తించి, ప్రాథమిక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో 150 నుంచి 200 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు నడుస్తుండగా.. ప్రభుత్వం భూములు కేటాయించిన మరో 5 గిగావాట్ల ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా తెలంగాణలో మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యం ఏకంగా 11 గిగావాట్లకు పైగా దాటనుందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో పాటు CtrlS, క్యాపిటాలాండ్, NTT డేటా, సిఫీ, ఎస్‌టీటీ గ్లోబల్ వంటి సంస్థలు తమ కేంద్రాలను నడుపుతున్నాయి.డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా నీటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా చందన్‌వెల్లి, భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని క్లస్టర్ల నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని సెవెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నుంచి సేకరించిన మురుగునీటిని అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తారు. పబ్లిక్