దృశ్యం సినిమా కన్నా ఎక్కువ సస్పెన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది
Actor ProfileCelebrity

దృశ్యం సినిమా కన్నా ఎక్కువ సస్పెన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దృశ్యం సినిమా కన్నా ఎక్కువ సస్పెన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది
TV9 Telugu18 Jul 2026
దృశ్యం సినిమా కన్నా ఎక్కువ సస్పెన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది

ఓటీటీలో సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈమధ్య ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల పట్ల క్రేజ్ పెరుగుతుంది. ఓటీటీలో నిత్యం ఏదోక కొత్త కంటెంట్ విడుదలవుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎన్నో థ్రిల్లర్ సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాల కథ, ముగింపు మాత్రం ఏళ్ల తరబడి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ఒక అసాధారణమైన చిత్రం 5 సంవత్సరాల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అది సస్పెన్స్ విషయంలో అన్ని హద్దులను దాటింది. ఈ సినిమా క్లైమాక్స్ ఎంత శక్తివంతంగా, దిగ్భ్రాంతికరంగా ఉంటుందంటే, దానిని నేరుగా ‘దృశ్యం 3’ లేదా ‘మహారాజా’ వంటి కళాఖండ చిత్రాలతో పోలుస్తారు. ఈ సినిమాలోని సస్పెన్స్, ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా కథ, ఢిల్లీకి చెందిన ‘రాణి’ అనే అమ్మాయి, ఒక చిన్న పట్టణానికి చెందిన నిరాడంబరమైన, నిక్కచ్చి ఇంజనీర్ అయిన ‘రిషు’ను పెళ్లి చేసుకోవడం చుట్టూ తిరుగుతుంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో, మొదట్లో వారి బంధంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఇంతలో, రిషు కజిన్ ‘నీల్’ వారి ఇంట్లో ఉండటానికి వస్తాడు. నీల్ డాషింగ్ స్టైల్ చూసి రాణి అతనితో ప్రేమలో పడుతుంది, వారి బంధం మరింత బలపడుతుంది. భయంకరమైన సిలిండర్ పేలుడులో రిషు మరణించడంతో కథలో అసలైన మలుపు వస్తుంది. పోలీసులకు రిషు పూర్తి శరీరం దొరకదు, కేవలం అతని చేతి ముక్క మాత్రమే లభిస్తుంది. రిషు హత్య కేసులో రాణి, నీల్‌లపై అనుమానం కలుగుతుంది. రాణి డైరీలో వారి గొడవకు సంబంధించిన అనేక ఆధారాలను పోలీసులు కనుగొంటారు. అయితే, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, పోలీసులను, ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక నిజం వెలుగులోకి వస్తుంది. ఈ సినిమా పేరు ‘హసీన్ దిల్‌రూబా’, ఇది 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించింది

ద శ య స న మ కన న ఎక క వ సస ప న స స షల మ డ య ల ట ర డ గ మ వ ఓట ట ల గత తరల ప త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in