
Bride kills husband: ప్రేమ ఒకవైపు... పెళ్లి మరోవైపు... ఎటువైపు మొగ్గుచూపాలని తెలియక నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసు కేసులతో జైలు పాలై జీవితాలను బుగ్గిపాల్జేసుకుంటున్నారు. పెళ్లీడుకొచ్చిన యువతుల మానసిక ఒత్తిడితో నేరపూరిత ఘటనల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సియా గోయల్ ఘాతుకం.. కూతురు జీవితాలను అద్భుతంగా తీర్చి దిద్దాలని తల్లిదండ్రులు సంబంధాలను చూసి పెళ్లిచేసి అత్తారింటికి పంపాలనే తపన... పోలీసు కేసులతో జైలుకు పంపేలా చేస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుళ్ల కలను నెరవేర్చాలని తపించే అమ్మానాన్నలను నిర్ఘాంత పోయే విధంగా చేస్తున్నారు. క్షణికావేశం కాదు... ప్రేమ అనే మత్తులో మునిగి... ప్రేమ విజేతగా నిలవాలనే భావన నేరస్తులుగా మిగిలిపోతున్నారు. పోలీసు కేసులతో దోషులుగా నిలిచి... జైల్లో ఊఛల్లెక్కిస్తున్నారు. విద్యాబుద్ధులతో సమాజం గర్వించుకునే విధంగా బతకాల్సిన యువత.. ప్రేమ ముసుగులో నేరపూరిత చరిత్రలో అమాయకులు బలవుతున్నారు. చదువుతో సంస్కారవంతులుగా ఎదగాల్సిన నవతరం... చరిత్ర హీనులవుతున్నారు. సమాజంలో గర్వించే విధంగా పేరు నిలబెడుతారని, వ్యక్తిగతంగా మంచి పేరుతీసుకొస్తారని భావించిన తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుట్టును రట్టుచేసిన పోలీసులు.. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ కూతురు సియాగోయల్ చేసిన ఉదంతంతో తల్లిదండ్రులు తలదించుకునేలా చేసింది. సంపన్న కుటుంబంతో సంబంధం వెతికి పెళ్లికి నిశ్చయించారు. యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్‌తో పెళ్లి జరిపించే విధంగా పెద్దల సమక్షంలో పెళ్లి కుదిరింది. ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం చేశారు. నవంబరులో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించాలని పెద్ధలు సన్నాహాలు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కోటలో 17 కోట్ల రూపాయల వ్యయంతో పెళ్లి వేడుక నిర్వహించాలని ప్యాలెస్ బుక్ చేశారు.బంధుమిత్రులను పూణే నుంచి ప్యాలెస్‌కు తీసుకెళ్లేందుకు రెండు హెలికాప్టర్లను సిద్ధంచేసేలా ముందే మాట్లాడుకున్నారు. పెళ్లి నవంబరులో జరగాల్సి ఉండగా.. సియా గోయల్ తన కాబోయే భర్తతో ప్రీవెడ్డింగ్ షూట్స్ ఫోటోలు, వీడియోలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కాబోయే పెళ్లికూతురు సియాగోయల్ పుట్టినరోజు జూన్