
Eenadu•14 Jun 2026
దివ్యాంగుడు వెంకటరమణను సన్మానించిన మంత్రి జూపల్లిపట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్న వెంకటరమణ అందరికీ ఆదర్శమని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. కాలు కదపలేని స్థితిలో ఉన్నప్పటికీ.. తన ప్రతిభతో సొంతంగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన వెంకటరమణ సంకల్పం గొప్పదని ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లా కైలాసనగర్‌లో దివ్యాంగుడి ఇంటికి వెళ్లి అతడిని మంత్రి జూపల్లి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ వార్త చదివారా: 1.44 లక్షల మందికి బ్రేక్‌ఫాస్ట్