
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మూవీ హైలైట్స్ తెలిపారు. • పదేళ్ల కిందట వచ్చిన ప్రయోగాత్మక చిత్రం మిణుగురులు చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశా. ఆ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ లైబ్రరీలో ఆ స్క్రిప్ట్ భద్రపరిచారు. పదేళ్లకుపైగా ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. చిన్న చిన్న డెమో ఫిల్మ్స్, సాంగ్స్, షార్ట్స్ ఫిల్మ్స చేసేవాణ్ని. సినిమాలు, ఇంటర్వ్యూలు చూసి సినిమా గురించి నేర్చుకున్నా. షార్ట్స్, కలర్ ఫాలెట్ ఏవీ నేర్చుకోలేదు. సినిమా చూస్తూ సినిమాను ఎంజాయ్ చేసేవాణ్ని. సినిమా నచ్చకపోతే బాగా తిట్టేవాణ్ని. చెత్త రైటింగ్ కు అవకాశం వచ్చింది. నాకెందుకు అవకాశం రాలేదనుకునేవాణ్ని. ఒక రకమైన ప్రస్టేషన్ ఉండేది. నా కథలన్నీ గొప్పగా ఉంటాయి. వాటన్నింటిని తెరపై చూడాలని ఉండేది. చూసినవాళ్లంతా ఎవర్రా ఈ సినిమా తీసిందని గొప్పగా మాట్లాడుకోవాలి. అదే నా మైండ్ లో రన్ అవుతూ ఉండేది. నేను 10 గంటలు కూర్చొని ఉద్యోగం చేస్తున్నప్పుడల్లా నా మైండ్ లో మొత్తం సినిమానే రన్ అవుతూ ఉండేది. జాబ్ లో ప్రమోషన్స్ కూడా వద్దనుకునేవాణ్ని. ఎందుకంటే ఆ పని నాకు నచ్చేది కాదు. నాకు మ్యాథ్స్ రాదు, సాప్ట్ వేర్ రాదు. ఎక్సెల్ రాదు, నాకు వచ్చింది కలలు కనడం. ఎన్నేళ్లైనా కూడా నాకు ఇప్పుడే పుట్టిన కలగా ఉండేది