దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్
Actor ProfilePolitician

దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్ పై పట్టాభి ఫైర్
Andhra Jyothy19 Jul 2026
దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్ పై పట్టాభి ఫైర్

వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవాలు మరచి గొడ్డలి పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడ, జూన్ 25: వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, అమరావతి గురించి దేవినేని నెహ్రూ గతంలో ‌చేసిన వ్యాఖ్యలను మీడియాకు‌ వినిపించామని అన్నారు. వాస్తవాలు మరచి గొడ్డలి పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న దేవినేని అవినాష్ స్థాయిని మరచి మితిమీరి మాట్లాడున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అవినాష్ మూడు పార్టీలు మారారని.. వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూసినట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండటంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారని.. తరువాత కాంగ్రెస్‌లోకి వెళ్లినా మళ్లీ టీడీపీలోకి వచ్చారని పట్టాభి తెలిపారు. తుదిశ్వాస వరకు టీడీపీలో ఉండి పసుపు జెండాతోనే దివికేగారని అన్నారు. ఆ తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్.. పిల్ల సైకోగా మారారంటూ విమర్శించారు. ఏ దారీ లేకపోవడంతో జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేశ్‌పై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. వారి ప్రోత్సాహంతో తెలుగు యువత అధ్యక్షుడిగా, గుడివాడ ఎమ్మెల్యేగా అవినాష్ పోటీ చేశారని.. ఓటమిపాలైనా కూడా చంద్రబాబు అండగా నిలిచారని గుర్తుచేశారు. దేవినేని నెహ్రూ ‌పార్థివదేహాన్ని చంద్రబాబు భుజాలపై మోశారని తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉన్న చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు మట్టి మాఫియా వెనుక గొడ్టలి‌ పార్టీ నేతలే ఉన్నారని పట్టాభి రామ్ ఆరోపించారు. ‘ఒకసారి టీడీపీ గురించి నీ తండ్రి చెప్పిన మాటలు వింటే నీకు వాస్తవం తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నా సొంత

ద వ న న న హ ర ల కప త న వ వ ఆఫ ట ర ల అవ న ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in