దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ క ల్యాణ్ ఆరోగ్యం
Actor ProfileCelebrity

దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ క ల్యాణ్ ఆరోగ్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ క ల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గ ణేశ్ భావోద్వేగ పోస్ట్
AP7AM19 Aug 2026
దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ క ల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గ ణేశ్ భావోద్వేగ పోస్ట్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. నిన్న త‌న అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రికి వెళ్లిన పవన్, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన భుజంలోని రొటేటర్ కఫ్‌తో పాటు మరో రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.పవన్ కల్యాణ్ కొంతకాలంగా ఈ గాయాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ గాయం వెనుక ఉన్న నేపథ్యాన్ని, నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ గాయాలు సుమారు 15 ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో తగిలినవని ఆయన వెల్లడించారు."నిన్న రాత్రంతా నిద్ర రాలేదు.. ఒకటే ఆలోచన.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం.. గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం.. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ