దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ ఆరోగ్యం
Actor ProfilePolitician

దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ ఆరోగ్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ ఆరోగ్యంపై బండ్లన్న ఎమోషనల్ ట్వీట్
Samayam Telugu19 Aug 2026
దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ ఆరోగ్యంపై బండ్లన్న ఎమోషనల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర భుజాల నొప్పితో బాధపడుతున్న విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఆయన ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిని సందర్శించగా, అక్కడ ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ (Rotator Cuff) తీవ్రంగా గాయపడినట్లు, అలాగే అక్కడి కండరాలు చిట్లినట్లు (Muscle Tear) వైద్య నిపుణులు గుర్తించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆయనకు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్య బృందం సూచించింది.సర్జరీని వాయిదా వేసుకున్న డిప్యూటీ సీఎం! వైద్యులు తక్షణమే సర్జరీ చేయించుకోవాలని హెచ్చరించినప్పటికీ, పవన్ కళ్యాణ్ మాత్రం తన వ్యక్తిగత ఆరోగ్యం కంటే ప్రజా సంక్షేమమే మిన్న అని నిరూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాలనాపరమైన బాధ్యతలు, ముందుగా ఖరారైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే ఆయన తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ షెడ్యూల్స్ అన్నీ సజావుగా పూర్తయిన తర్వాతే, వీలును బట్టి శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిర్ణయించుకున్నారు. తీవ్రమైన శారీరక నొప్పిని భరిస్తూ కూడా ఆయన ప్రజా సేవలో నిమగ్నం కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.* షాకింగ్ వీడియో: డెలివరీ బాయ్‌పై విరుచుకుపడ్డ 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్ పవన్ కళ్యాణ్ భుజాల గాయం, సర్జరీ వార్త బయటకు రాగానే ఆయన పరమ భక్తుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్‌ను తన దైవంగా భావించే బండ్ల గణేష్, సోషల్ మీడియా వేదికగా తన ఆరాధ్య దైవానికి సంఘీభావం తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన… ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో