
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bandla ganesh emotional post on Pawan kalyan shoulder pain: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా భూజాల నొప్పితో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన భుజంలోని రొటెటర్ కఫ్ తో పాటు మరో రెండు కండరాల్లో గాయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో నిన్న హుటా హుటీన తనసతీమణి అన్నా లెజినోవాతో కలిసి ముంబైలోకి కోకిలాబెన్ ధీరుబాయ్ అంబాని ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో వైద్యులు సర్జరీ అత్యవసరంఅని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇస్తు సర్జరీ వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సర్జరీపై నిర్మాత బండ్ల గణేష్ భావొద్వేగంతో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భుజం గాయం వెనుకాల సుమారు 15 ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ నాటి పరిస్థితుల్ని మరోసారి పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సర్జరీ తప్పనిసరి వార్తలు తెలిసినప్పటి నుంచి తనకు "నిన్న రాత్రంతా నిద్ర రాలేదని ఎమోషనల్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయిందంటూ భావొద్వేగంతో ట్విట్ చేశారు. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడని, అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణమని పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. ఇప్పటికి గుజరాత్ లో గుర్రం మీద నుంచి పడిపోయినగబ్బర్