దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా
Actor ProfileActor

దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా

Total News1
Movie Updates0
Sources1
దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఉత్తర అమెరికాలో 3.2 మిలియన్ వసూళ్లు అందుకొంది. రెండో వీకెండ్ ముగిసే సరికి “పెద్ది” 3.4 మిలియన్ వసూళ్లు సాధించగలదు. ఆ తర్వాత ఎంత రాబడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం. ఐతే, పది రోజుల తర్వాత కూడా ఈ సినిమా ఎన్టీఆర్ నటించిన “దేవర” (Devara) మొదటి రోజు వసూళ్లను రాబట్టలేకపోవడమే పెద్ద సమస్య. దేవర మొదటి రోజు (ప్రీమియర్ ప్లస్ ఫస్ట్ డే) వసూళ్లు కలిసి 3.7 మిలియన్ డాలర్లు. ఓవరాల్ గా ఈ సినిమా 6 మిలియన్ డాలర్లను రాబట్టుకొంది. ప్రీమియర్ షోలు, మర్నాడు అంటే మొదటి రోజు మొత్తంగా 3.7 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇంత కూడా “పెద్ది” ఇప్పటివరకు పొందలేకపోయింది. అందుకే ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని వెక్కరిస్తున్నారు. మొత్తం రన్ ముగిసే సరికి “పెద్ది” చిత్రం దేవర మొదటి రోజు వసూళ్లను దాటగలదా అని ప్రశ్నిస్తున్నారు. ఐతే, “దేవర” అంత వసూళ్లు అందుకున్నా ఆ తర్వాత ఎన్టీఆర్ తన బాలీవుడ్ చిత్రంతో చతికిలపడ్డాడు. “వార్ 2” అమెరికాలో 3.8 మిలియన్ వసూళ్లను మాత్రమే అందుకొంది. “దేవర” క్రేజ్ “వార్ 2″కి కలిసి రాలేదు కదా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. సరైన సినిమా పడితే రామ్ చరణ్ కూడా పది మిలియన్ వసూళ్లు కొట్టగలడు అని అంటున్నారు

ద వర మ దట ర జ కల క షన లన ద టగలద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in