
Zee Telugu•17 Jul 2026
దెయ్యాలు వేదాలు వళ్లిస్తున్నట్లుంది.. మీనాక్షి నటరాజన్ పై ఎంపీ రఘనందన్ రావు సంచలన వ్యాఖ్యలుMP Raghu Nandan rao: బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలపై ఎంపీ రఘనందన్ రావు మండిపడ్డారు. అంతే కాకుండా గతంలో ఐదు దశాబ్దాల పాలనలో అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. ప్రధానిగా నెహ్రు ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఏంచేసిందో అందకి తెలుసన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని కూడా ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎంపీ రఘనందన్ రావు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు