ది డివోర్స్
Actor ProfileActor

ది డివోర్స్

Total News1
Movie Updates0
Sources1
ది డివోర్స్
Sakshi14 Jun 2026
ది డివోర్స్

ఆరోజు వాట్సప్‌లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్‌ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్‌ నుంచి వచ్చిన నోటీస్‌. కారణం ఇన్‌ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా ఆ నోటీస్‌ని పంపాడని ఆమె మథనపడసాగింది. అది ఆమెకి నమ్మశక్యంగా లేదు. తల్లికి మైనర్‌ సర్జరీ జరుగుతూంటే తను వారం క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె దాన్ని తన తండ్రికి ఫార్వర్డ్‌ చేసింది. పావుగంట తర్వాత ఆయన ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి కంగారుగా అడిగాడు. ‘‘ఏమిటిది బేబీ విచిత్రంగా?’’ ‘‘అవును. నాకూ చిత్రంగానే ఉంది.’’ ‘‘ఇన్‌ కంపాటిబిలిటీ అంటే ఏమిటో అతగాడికి ఫోన్‌ చేసి కనుక్కో.’’ ఆయన కోపంగా చెప్పాడు. ‘‘నేను కనుక్కోను. ఇలాంటి విషయాల్లో ముందు నాతో సంప్రదించడం మర్యాద. అతను ఆ మర్యాదని నిలబెట్టుకోలేదు.’’ ఆమె కఠినంగా చెప్పింది. ‘‘నేను కనుక్కుంటాను. మీ మధ్య పోట్లాటేదైనా జరిగిందా?’’ ఆయన అడిగాడు. ‘‘వచ్చే ముందు చిన్న పోట్లాట జరిగింది. ఇల్లు కట్టుకుంటానంటే నాతో చెప్పకుండా తన తమ్ముడికి ఐదు లక్షలు పంపాడు. నేను నెలకి ఎంత చొప్పున ఎంతకాలంలో తిరిగి ఇవ్వాలో షెడ్యూల్‌ కూడా పంపమని సలహా ఇచ్చాను. తన తమ్ముడికి అప్పు ఇవ్వలేదని, బహుమతి ఇచ్చానని చెప్పాడు. క్రితం నెలలోనే తల్లి పుట్టినరోజుకి ఏభై వేలు పెట్టి పట్టుచీర కొన్నాడు. నేను పదివేల చీర సరిపోదా అని అడిగాను.’’ ‘‘రేపు పిల్లలు పుడితే అతనికే జాగ్రత్త వస్తుంది.’’ ఆయన చెప్పాడు. ‘‘లేదు. లేదు. రాదు. ఆ మనిషికి తన వాళ్ళంటే ప్రేమ. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంత దాకా పాతిక లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. ఇంకో పాతిక వేసుకుంటే మన ఊళ్ళో డబుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌ వచ్చేది. నెలకి రెండున్నర వేలైనా అద్దె వచ్చేది.’’ ‘‘ఫైనాన్స్‌ కాక ఈమధ్య ఇంకేమైనా పొరపొచ్చాలు ఉన్నాయా?’’ ‘‘లేవు. మా అత్తమామలు

ద డ వ ర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in