
రుద్రంపూర్, జూన్ 27 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం- విజయవాడ హైవేపై 16వ డివిజన్ పరిధిలో చేపడుతున్న కాల్వ నిర్మాణం షాప్ యజమానులకు నష్టం కలగకుండా చేపట్టాలని డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ నగర కమిషనర్ కొడరు సుజాతకి విన్నవించారు. శనివారం నేషనల్ హైవేపై చినుకు పడితే ఆ ప్రాంతం చెరువు లాగా మారి పాదచారులకు, వెహికల్ పై వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రతి రోజు శానిటేషన్ సిబ్బంది ఆ నీటిని క్లియర్ చేసేందుకు గంటల కొద్ది సమయం వెచ్చించాల్సి వస్తుందని ఎమ్మెల్యే కూనం సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని నగర కమిషనర్ కి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దానిలో భాగంగా కమిషనర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి రోడ్డు మధ్య నుండి 50 మీటర్లు లో కాలువ నిర్మాణం చేపట్టాలని మార్కింగ్ ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్ మునిగడప పద్మ కమిషనర్ కి 47 మీటర్లలో కాలువ నిర్మాణం చేపట్టి షాపు యజమానులకు ఆర్థిక ఇబ్బంది కలగకుండా చూడాలని కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ భవిష్యత్‌లో నేషనల్ హైవే ఆరు లైన్ల రోడ్డు జరిగే క్రమంలో అప్పుడు నష్టపోవాల్సి వస్తది అని, ఇప్పుడు 50 మీటర్లు పెట్టుకుంటే అప్పుడు నేషనల్ హైవే వారు ఆలోచిస్తారని లేదంటే రెండుసార్లు నష్టపోవాల్సి వస్తుందని కమిషనర్ తెలిపారు. అయినా ఒకసారి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. వ్యాపారస్తులు కూడా తమకు నష్టం కలగకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని కమిషనర్ ను వేడుకున్నారు. అనంతరం గోధుమ వాగు పై గుంటలను పూడ్చాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కమిషనర్ నాలుగైదు రోజుల్లో రోడ్డు రిపేర్ చేస్తామని తెలిపినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ బి.శ్రీకాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ గుంటి శ్రవణ్, మాజీ కౌన్సిలర్ మునిగడప వెంకటేశ్వర్లు, జవాన్లు ప్రభుదాసు, లక్ష్మణ్ పాల్గొన్నారు