ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదిక
Actor ProfileCelebrity

ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్
AP7AM6 Jul 2026
ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన బాహుబలి చిత్రానికి సంబంధించిన ఒక సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరుతో వస్తున్న యానిమేటెడ్ చిత్రం, ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక యానెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైందని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ ఫెస్టివల్‌లోని 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' సెషన్‌లో తమ చిత్రం ప్రదర్శనకు ఎంపిక కావడంపై ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "బాహుబలి: ది ఎటర్నల్ వార్ చిత్రం యానెసీ ఫెస్టివల్‌కు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది" అని ప్రశంసించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడు చూస్తారా అని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రభాస్ పేర్కొన్నారు. బాహుబలి ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ యానిమేటెడ్ చిత్రం, విడుదల కాకముందే అంతర్జాతీయ గుర్తింపు పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు, బాహుబలి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు

ద ఎటర నల వ ర త మర స ర అ తర జ త య వ ద క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in