
Israel Lebanon Ceasefire: పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెజ్బుల్లా సాయుధ సంస్థతో అధికారికంగా కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం మరోసారి లండన్‌పై విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ ప్రాంత లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం, డ్రోన్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. లెబనాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సమాచారాన్ని ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తాజా దాడుల్లో కనీసం ఐదుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. Read also:Israeli envoy : ‘ఇక మీరు మౌనంగా ఉండాలి’: ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర ఆగ్రహం లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) నివేదిక ప్రకారం.. దక్షిణ లెబనాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన ‘నాబతీహ్’ (Nabatieh) నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. తెల్లవారుజామున ప్రజలు నిద్రిస్తున్న సమయంలో జరిగిన ఈ ఆకస్మిక దాడుల కారణంగా అనేక నివాస సముదాయాలు, ఇళ్లు ల్యాండ్‌మార్క్‌లతో సహా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. Kumbhamela Monalisa: మోనాలిసా కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు.. రక్షణ కల్పించాలని ఆదేశం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Hindus In Bangladesh : శ్రీరాముడిని అవమానించారని బంగ్లాదేశ్ హిందువుల నిరసన G7 Summit Viral Comments : ‘ఐ యామ్ ది బాస్’ వ్యాఖ్యలపై ట్రంప్ క్లారిటీ: కేవలం జోక్ మాత్రమేనని వివరణ! Israeli envoy : ‘ఇక మీరు మౌనంగా ఉండాలి’: ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర ఆగ్రహం James Burrows:ప్రముఖ


.webp)