
సౌత్ సినిమాలో పాటల మీద మేకర్స్ గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాంగ్స్‌కు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సాంగ్స్ ఆడియన్స్‌ను చాలా ఈజీగా ఎట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫుల్ ఎనర్జీ, అదిరిపోయే డాన్స్, అదిరిపోయే బీట్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా రీల్స్, సోషల్ మీడియా జమానా నడుస్తోంది. అందుకే ఇలాంటి మాస్, ఎనర్జిటిక్ సాంగ్స్ చాలా ఫాస్ట్‌గా వైరల్ అవుతున్నాయి. అందుకే మేకర్స్ కూడా ప్రతి సినిమాలో జనాలు నోట్లో నానేలా ఒక సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటలు కేవలం సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్లడమే కాదు, ప్రమోషన్స్‌కు మెయిన్ వెపన్‌లా మారుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాల నుండి ఇలాంటి సాంగ్స్ వస్తున్నాయంటే చాలు, రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కోట్లాది మంది ఈ పాటలను చూస్తూ షేర్ చేస్తున్నారు. ఇదే తరహాలో సమంత సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఒక కొత్త సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ కంప్లీట్‌గా పెళ్లి వేడుక, పండగ వాతావరణం చుట్టూ తిరుగుతుంది. సాంగ్‌లో కలర్‌ఫుల్ సెట్స్, అద్భుతమైన డాన్స్, ఒక హ్యాపీ ఫ్యామిలీని చూపించారు. పాత ట్రెడిషనల్ ట్యూన్స్‌కు ఈ కాలపు మోడ్రన్ బీట్స్‌ను మిక్స్ చేయడం ఈ పాటలో బెస్ట్ పార్ట్. అందుకే ఇది పిల్లల నుండి ముసలివాళ్ల వరకు అందరికీ తెగ నచ్చేస్తోంది. దీని కొరియోగ్రఫీ, విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండటంతో ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. ఈ సూపర్ హిట్ సాంగే ‘ సమంత తస్సదియా’ పాట. ‘తస్సదియా’ అనేది ఫుల్ ఎనర్జీ, హై వోల్టేజ్‌తో కూడిన వెడ్డింగ్ సాంగ్. ఈ పాటను ఫేమస్ సింగర్స్ చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ తమ బ్యూటిఫుల్ వాయిస్‌తో పాడారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్