తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజులు సెలవులు
Actor ProfilePolitician

తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజులు సెలవులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్
Asianet News Telugu17 Jun 2026
తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్

Holidays : సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు దసరా, సంక్రాంతి పండగలకు వరుస సెలవులు వస్తుంటాయి. కానీ ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా మొహర్రం పండక్కి భారీ సెలవులు వస్తున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో భారంగా స్కూళ్లకి వెళుతున్న తెలుగు విద్యార్థులు ఈ మొహర్రం సెలవుల గురించి తెలిసి ఎగిరి గంతేస్తున్నారు. ఈ మొహర్రం సెలవు వీకెండ్ తో కలిసివస్తోంది... కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వరస సెలవులు కలిసివస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం (2026) ఆరంభంలో ప్రకటించిన హాలిడే లిస్ట్ లో మొహర్రం సెలవు జూన్ 25న ఉంది. అయితే దేశవ్యాప్తంగా మొహర్రం వేడుకలు జూన్ 26న జరుపుకుంటున్నారు... అందుకే రాష్ట్ర ప్రజలు, వక్ఫ్ బోర్డ్ అభ్యర్థన మేరకు ఈ సెలవులను మార్చింది ప్రభుత్వం. గతంలో జూన్ 16న (మంగళవారం) ఐచ్చిక సెలవుగా ప్రకటించింది... దీన్ని మొహర్రం ముందురోజు జూన్ 25కి మార్చింది కూటమి ప్రభుత్వం. అంటే మొహర్రం వేడుకలు జరుపుకునేవారు ముందస్తు అనుమతితో జూన్ 25 (గురువారం) వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఇదే సమయంలో గతంలో జూన్ 25 ను మొహర్రం సాధారణ సెలవుగా ప్రకటించగా దీన్ని జూన్ 26కి మార్చింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 25న మొహర్రం ముందురోజు ఐచ్చిక సెలవు ఇచ్చింది ప్రభుత్వం... ఈ సెలవు తీసుకునే కొందరు ఉద్యోగులకు వరుసగా నాల్రోజుల హాలిడేస్ కలిసివస్తున్నాయి. జూన్ 26న ఎలాగూ మొహర్రం పండక్కి సాధారణ సెలవుంది... కాబట్టి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. ఇక కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది... ఇలాంటివారికి నాల్రోజుల సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. బ్యాంక్ ఉద్యోగులకు కూడా మొహర్రం సెలవు కలిసివస్తోంది. జూన్ 26 (శుక్రవారం) పండగ సెలవు అయితే జూన్ 27న నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవుంది. ఇక