
అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతిష్టాత్మక 19వ మహాసభలకు సర్వం సిద్ధమవుతోంది. జూలై 31, ఆగస్టు 1, 2 తేదీలలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా తెలుగు టైమ్స్ తో కాన్ఫరెన్స్ వివరాలను పంచుకున్నారు. వాటి వివరాలను ఇక్కడ ఇస్తున్నాము. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే ఈ 19వ ఆటా మహాసభలు ఒక పండుగ వాతావరణంలో, కుటుంబ సమేతంగా ఆనందించేలా ఉంటాయని జయంత్ చల్లా అంటూ, ఈ మహాసభలకోసం దాదాపు 70కి పైగా ప్రత్యేక సబ్-కమిటీలను (కల్చరల్, బిజినెస్ అండ్ స్టార్టప్స్, యూత్ ఫోరమ్స్, పొలిటికల్ ఫోరమ్స్, ఉమెన్స్ ఫోరమ్స్, కల్చరల్ కమిటీలు ఇలా పలు కమిటీలను ఏర్పాటు చేశాము. కమిటీలన్ని తమ పనులను పూర్తి చేస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. ప్రముఖులకు ఆహ్వానం ఈ మహాసభలకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, మంత్రులను, ఇతర పార్టీల నాయకులను స్వయంగా కలిసి ఆహ్వానించామని, ఈ మహాసభలకు అందరూ వస్తానని చెప్పారని తెలిపారు. వీరితోపాటు సాహితీవేత్తలు, సినీరంగానికి చెందిన నటీనటులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు ఇలా అందరూ తరలివస్తున్నారని చెప్పారు. బిజినెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయా రంగాల ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులను పంపిస్తామని హామి ఇచ్చారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వస్తానని హామి ఇచ్చారు. ఇలా పలువురు నాయకులు ఆటా మహాసభలకు వచ్చేందుకు సంసిద్ధత తెలిపారు. వివిధ పోటీలు, కార్యక్రమాలు ఈ మహాసభలకోసం వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. మహాసభల నిర్వహణకు ముందుగా అమెరికాలోని 12 ప్రధాన నగరాల్లో ప్రత్యేక కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఝుమ్మంది నాదం” (గాన పోటీలు) మరియు “సయ్యంది పాదం” (నృత్య పోటీలు) కార్యక్రమాల