తెలుగులో ఎప్పుడూ చూడని సినిమా అంటూ మ హేష్
Actor ProfileCelebrity

తెలుగులో ఎప్పుడూ చూడని సినిమా అంటూ మ హేష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగులో ఎప్పుడూ చూడని సినిమా అంటూ మ హేష్ కామెంట్స్
Telugu Times30 Aug 2026
తెలుగులో ఎప్పుడూ చూడని సినిమా అంటూ మ హేష్ కామెంట్స్

వెంకట్ మహా(Venkatesh Maha) దర్శకత్వంలో రూపొందిన రావు బహదూర్(Rao Bahadur) జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్(Satyadev) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ బాబు(Mahesh Babu) సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రిలీజ్ కు ముందు సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుండగా, తాజాగా సత్యదేవ్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ పరంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మాట్లాడిన సత్యదేవ్, మహేష్ బాబు(mahesh babu), నమ్రత(namratha) ఇప్పటికే సినిమాను చూశార‌ని వెల్లడించారు. సినిమా చూసిన త‌ర్వాత దాదాపు 40 నిమిషాల పాటు సినిమాలోని పలు అంశాలపై తన‌తో డిస్క‌స్ చేశార‌ని చెప్పారు. అంతేకాదు, ట్రైల‌ర్ కు మహేష్ బాబు తన వాయిస్ అందించగా, డైరెక్ట‌ర్ సుకుమార్(Sukumar) కూడా సినిమా చూసి ప్రశంసించినట్లు వెల్లడించారు. ఈ ముగ్గురూ ఇలాంటి తెలుగు సినిమా ఇప్పటివరకు రాలేద‌ని చెప్పారని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఆ మాటల అర్థం పూర్తిగా తెలుస్తుందని సత్యదేవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ట్రైల‌ర్, ప్ర‌మోష‌నల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన రావు బహదూర్ ఇప్పుడు ప్రముఖుల ప్రశంసలతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. వెంకట్ మహా తనదైన కథనం, విభిన్నమైన టేకింగ్‌తో మరోసారి ప్రత్యేక ముద్ర వేయబోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహేష్ బాబు, నమ్రత, సుకుమార్ వంటి ప్రముఖుల నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు అదనపు బలంగా మారగా, జూలై 3న విడుదలయ్యే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది

త ల గ ల ఎప ప డ చ డన స న మ అ ట మ హ ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in