తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Actor ProfilePolitician

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Zee Telugu18 Jul 2026
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rain Alert In Ap, Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు దంచికొట్టనున్నాయి. జూన్ 25న ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 26, 27 తేదీల్లోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ సహా దాదాపు 28 జిల్లాల్లో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల

త ల గ ర ష ట ర ల ప రజలక బ గ అలర ట మ డ ర జ ల ప ట భ ర వర ష ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in