తెలంగాణ వెదర్ అప్ డేట్స్.. రానున్న మూడు రోజులు ఇలా
Actor ProfileCelebrity

తెలంగాణ వెదర్ అప్ డేట్స్.. రానున్న మూడు రోజులు ఇలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ వెదర్ అప్ డేట్స్.. రానున్న మూడు రోజులు ఇలా
Zee Telugu15 Aug 2026
తెలంగాణ వెదర్ అప్ డేట్స్.. రానున్న మూడు రోజులు ఇలా

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Weather Updates: రాబోయే 2 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లలోని మిగిలిన భాగాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆ తదుపరి 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని మరికొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఆగ్నేయ రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు మరియు గుజరాత్‌లోని మిగిలిన భాగాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలపై ఆదివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతూ, ఇప్పుడు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడాల మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతాల నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ద్రోణి (Trough) బలహీనపడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి బలహీనపడింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విదర్భ మీదుగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బలహీనపడింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల వాతావరణం ఇలా