
శ్రీరాంపూర్: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత తలపెట్టిన భూగర్భగని వద్ద ‘బొగ్గుబాయి’ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్మికసంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్లను తోసుకొని కవిత, పార్టీ శ్రేణులు గని ఆవరణలోకి దూసుకెళ్లారు. ‘బొగ్గు బాయి’ కార్యక్రమంలో తమను అడుగడుగునా సింగరేణి యాజమాన్యం అడ్డుకుంటుందని, కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే హక్కు తమకు ఉందని ఈ సందర్భంగా కవిత అన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. అడవిలో అన్నలు లేరని సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలో కూడా ఉన్నారన్నారు. కార్మికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు