తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల, పింఛన్‌దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో రెండు వేల కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల మే 29న మొదటి విడతగా రెండు వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే రెండో విడత నిధులను కూడా సర్దుబాటు చేసింది. దీంతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఉద్యోగ వర్గాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం బకాయిల నిధులు నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగ జేఏసీ నాయకులతో గతంలో జరిపిన చర్చల సారాంశం ప్రకారం.. దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలను తీర్చేందుకు వంద రోజుల వ్యవధిలో ఆరు వేల కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలోనే ఈ నిధుల విడుదల వేగంగా సాగుతోంది.ఈ నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర రాయితీల బకాయిల చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశామని వివరించారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా కాలంగా పెండింగులో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను వంద శాతం క్లియర్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో జీపీఎఫ్
Actor ProfilePolitician
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్లు విడుదల
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Aug 2026
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్లు విడుదల