తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ
Actor ProfilePolitician

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ
TeluguOne22 Aug 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు, ఐఏఎస్ ఈ రోజు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు. లోకం చూడకముందే బిడ్డ మృతి... దుఃఖంలో గోల్ చేసిన స్టార్ ప్లేయర్! ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్ : సీఎం చంద్రబాబు