తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా
Actor ProfileCelebrity

తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా

Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా
Eenadu15 Jun 2026
తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా

దిల్లీ: తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు బయల్దేరితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వలేదని జనసేన (Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఇండియా గేట్‌కు వెళ్లి సైనికులకు వందనం చేయాలంటే కశ్మీర్‌, పంజాబ్‌లో పుట్టాలా?అని ప్రశ్నించారు. దిల్లీలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. ‘‘నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారు. ఒక నేల కోసం ఇంతలా ఆత్మబలిదానాలు చేసుకుంటారా? అనిపించింది. అందుకే వారంటే నాకు గౌరవం. యువతను బలిచేసి నాయకులు గద్దెనెక్కారు. అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా?ఏ ఆశయాల కోసం తెలంగాణ వచ్చిందో.. దానికోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది.. నేతలు, కార్యకర్తలు నిలబడాలి’’ అని పవన్‌ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమ్మ ప్రేమను, అవకాయ రుచిని, హైదరాబాద్‌ నగరాన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలకు తొలిరోజు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వేసవి సెలవులతో బోసిపోయిన పాఠశాలలు సందడిగా మారాయి

త ల గ ణ అమరవ ర లన గ ర త చ ద క 12 ఏళ ల సర ప ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in