
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao vs Revanth Reddy: రైతులకు బాకీపడ్డ రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని రైతుల పక్షాన రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని రైతుల పక్షాన నిలదీశారు. 'కేంద్రం కొనుమన్న పంటే కొంటాం, కేంద్రం కొనుమన్న అంతే కొంటాం అని అంటున్న రేవంత్ రెడ్డి మీరు ఉన్నది ఎందుకు. కేంద్రానికి సరెండర్ అయ్యారా? కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు. అంతే కొంటే మిగితా రైతుల పరిస్థితి ఏంటి..? వడ్లు కొనే చేతకాని ప్రభుత్వాన్ని రైతులు నమ్ముతారా?' అని ప్రశ్నించారు. జడ్చర్లలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించగా.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదు. 11 విడతల్లో రూ.73 వేల కోట్లు కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడు. మూడు పంటలకు మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడు' అని రేవంత్ రెడ్డి మోసాలను బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2021-2022లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని.. దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత? అని రేవంత్ రెడ్డిని తీసిపడేశారు. 'పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కల్వకుర్తిలో 3 లక్షల 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం