
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Telangana Weather Alert:తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం జూన్ 15 నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే రోజుల్లో వర్షపాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర పరిమితి హైదరాబాద్, భద్రాచలం సహా పలు ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. అలాగే రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులలో తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈరోజు మరియు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే రాబోయే మూడు రోజులలో పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలే కొనసాగనున్నాయి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మరియు రేపు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే