తెలంగాణలో భారీగా పెరిగిన కుటుంబాలు
Actor ProfileCelebrity

తెలంగాణలో భారీగా పెరిగిన కుటుంబాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో భారీగా పెరిగిన కుటుంబాలు, జనాభా
TeluguOne20 Aug 2026
తెలంగాణలో భారీగా పెరిగిన కుటుంబాలు, జనాభా

తెలంగాణ రాష్ట్రంలో జనాభా, కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తాజాగా చేపట్టిన జనగణన తొలి దశ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో నివసిస్తున్న మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు కోటీ 14 లక్షలకు చేరింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోలిస్తే.. ఈ తాజా జనగణనలో కుటుంబాల సంఖ్య భారీగా పెరగడం విశేషం. కేవలం కుటుంబాలే కాదు.. తెలంగాణ ఓవరాల్ జనాభా కూడా మునుపటి అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా పెరిగింది. ఈ అంచనాల ప్రకారం చూస్తే.. తెలంగాణ మొత్తం కుటుంబాలలో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ లోనే ఏకంగా 36 లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తేలింది. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక జనాభా విషయానికి వస్తే తాజా లెక్కలు విస్మయం గొల్పుతున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వేల ప్రకారం తెలంగాణ జనాభా 3.65 కోట్లలోపే ఉండవచ్చని భావించారు. కానీ ప్రస్తుత కేంద్ర జనగణన ప్రాథమిక నివేదికల ప్రకారం తెలంగాణ జనాభా ఏకంగా 4.35 కోట్లను దాటేసింది. 2010-11 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారిక జనగణన సమయంలో తెలంగాణ ప్రాంత జనాభా కేవలం 3.50 కోట్లుగా, కుటుంబాల సంఖ్య 83.05 లక్షలుగా ఉండేది. ఆ పాత లెక్కలతో పోల్చి చూస్తే.. ఇప్పుడు తెలంగాణ జనాభా దాదాపు 85 లక్షలు పెరగగా, కుటుంబాల సంఖ్య ఏకంగా 31 లక్షలు పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే.. పాత లెక్కల్లో రంగారెడ్డి జిల్లా 12.35 లక్షల కుటుంబాలతో టాప్‌లో ఉండేది. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత

త ల గ ణల భ ర గ ప ర గ న క ట బ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in