
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Rain Alert: నైరుతి రుతుపవనాలు హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫుల్‌బని, రాంచీ, జముయి, ముజఫర్‌పూర్ తూర్పు రేఖాంశం గుండా విస్తరించాయి. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులలో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌పై గల ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోందన్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా (అధికారులు తెలిపిన వివరాల ప్రకారం).. నేడు (మంగళవారం): ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వడగాల్పుల పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు రాష్ట్రంలోని ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు (17-06-2026): ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్