తిరుమల లడ్డు ప్రసాదం
Actor ProfilePolitician

తిరుమల లడ్డు ప్రసాదం

Total News1
Movie Updates0
Sources1
తిరుమల లడ్డు ప్రసాదంపై కేంద్రం బిగ్ యాక్షన్.. రంగంలోకి ప్రత్యేక ల్యాబ్స్, అసలు మ్యాటర్ ఇదే
Zee Telugu16 Jun 2026
తిరుమల లడ్డు ప్రసాదంపై కేంద్రం బిగ్ యాక్షన్.. రంగంలోకి ప్రత్యేక ల్యాబ్స్, అసలు మ్యాటర్ ఇదే

Enhancing Srivari Prasadams TTD Signs MoU With CSIR: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 91 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అందులో 32వేల మందికి పైగా స్వామివారికి తమ తలనీలాలను సమర్పించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డు ఎంతో విశేషమైనది. శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు సాంప్రదాయ స్వరూపాన్ని కాపాడాలనే ఉద్దేశంతో టీటీడీ, మైసూర్ లోని సీఎస్ఐఆర్ (CSIR) తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రసాదాల తయారీ, పంపిణీలో అత్యున్నత ప్రమాణాలను పాటించడం కోసం టీటీడీ ఈ ఒప్పందాన్ని చేసుకుంది. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. టీటీడీ తరఫున ప్రొక్యూర్మెంట్ జీఎం శ్రీ ఉమా శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి ఒప్పందం జరగడం ఇదే మొదటిసారి. సీఎస్ఐఆర్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా ముడి పదార్థాల కొనుగోలు నుండి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు అన్ని దశల్లో నాణ్యత ప్రమాణాలను అమలు చేస్తారు. నిల్వ ప్రక్రియలో శాస్త్రీయమైన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి, కలుషితాలను తగ్గిస్తారు. అలాగే రుచి, నాణ్యత దెబ్బతినకుండా ప్రసాదాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. దీనితో పాటు ప్రత్యేక ప్యాకేజింగ్ కోసం పరిశోధనలు చేపట్టడమే కాకుండా, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆధునిక పరీక్షా విధానాలు, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు, స్వచ్ఛత నిర్ధారణ వంటి అంశాలపై వారికి శిక్షణ అందిస్తారు. అంతేకాకుండా, సీఎస్ఐఆర్ (CSIR-CFTRI) సీనియర్ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు టీటీడీ కేంద్రాలను సందర్శించి తగిన సూచనలు అందిస్తారు. ఈ ఒప్పందం వల్ల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత మెరుగుపడతాయి. మరోవైపు

త ర మల లడ డ ప రస ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in