తిరుపతితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ముఖ్యమైన గమనిక. జులై 2న ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోవీబీ జీ రామ్ జీ ప్రారంభోత్సవ కార్యక్రమంనిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, ఏపీ సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరవుతున్నారు.. బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందుకే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. జులై 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ డైవర్షన్లను పాటించాలని తిరుపతి జిల్లా పోలీసులు సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ప్రయాణికులు చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలన్నారు. ట్రాఫిక్ విధుల్లో ఉండే పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు. అలాగే అత్యవసర సేవల వాహనాలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తామని.. ప్రజలు పోలీసుశాఖకు సహకరించానలని కోరారు. జులై 2న ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.తిరుపతి నుంచి కడప వైపు వెళ్లే వాహనాలు రైల్వే కోడూరు సర్కిల్, చిట్వేలి, బెస్తపల్లి, రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కడప వెళ్లాలని సూచించారు. కడప నుంచి తిరుపతి వచ్చే వాహనాలు రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్, బెస్తపల్లి, చిట్వేలి, రైల్వే కోడూరు మీదుగా తిరుపతి చేరుకోవాలన్నారు. పుల్లంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు ఓబులవారిపల్లి క్రాస్, చిన్న వూరంపాడు, వైకోట మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ డైవర్షన్లను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు కోరారు. ప్రయాణికులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని.. ప్రజల సహకారంతో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు.మంగంపేటలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, ఏపీ సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుల పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమీక్ష చేశారు. హెలిప్యాడ్ నుంచి కార్యక్రమం
Actor ProfilePolitician
తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•19 Aug 2026
తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లండి