తో ముంబైకి వచ్చి..12
Actor ProfileActor

తో ముంబైకి వచ్చి..12

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తో ముంబైకి వచ్చి..12,490 కోట్లకు కింగ్ గా మారిన బాద్షా ఆస్తుల వివరాలు ఇవే
Asianet News Telugu6 Aug 2026
తో ముంబైకి వచ్చి..12,490 కోట్లకు కింగ్ గా మారిన బాద్షా ఆస్తుల వివరాలు ఇవే

సుమారు 34 ఏళ్ల క్రితం... ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం 1,500 జేబులో పెట్టుకుని, కళ్ల నిండా కలలతో వచ్చాడు షారుఖ్ ఖాన్. కానీ ఇవాళ, ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనిక నటుల్లో ఒకరు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, షారుఖ్ ఆస్తి విలువ సుమారు 1.4 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు 12,490 కోట్లు! ఈ డబ్బు కేవలం సినిమాలతోనే రాలేదు. ప్రొడక్షన్ హౌస్, ఐపీఎల్ టీమ్, రియల్ ఎస్టేట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర పెట్టుబడులు... ఇలా అన్నీ కలిపి బాలీవుడ్ 'కింగ్ ఖాన్' ఈ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అసలు ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. యాక్టింగ్ మీద పిచ్చితో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్, మొదట్లో కొన్ని కష్టాలు పడ్డా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 25, 1992న ఆయన మొదటి సినిమా 'దీవానా' రిలీజ్ అయింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో, ఆయన కేవలం సూపర్‌స్టార్‌గానే కాదు, ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా కూడా ఎదిగారు. ముంబై బాంద్రాలో సముద్రం పక్కన ఉండే షారుఖ్ ఖాన్ బంగ్లా 'మన్నత్' గురించి తెలియని వాళ్లుండరు. దాని ప్రస్తుత విలువ సుమారు 300 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆ బంగ్లాలో రెనోవేషన్ పనులు జరుగుతుండటంతో, షారుఖ్ తన కుటుంబంతో కలిసి పాలీ హిల్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దాని నెలవారీ అద్దె సుమారు 24 లక్షలట. ఇది కాకుండా, అలీబాగ్‌లో ఆయనకు ఓ పెద్ద ఫామ్‌హౌస్ కూడా ఉంది. దాని విలువ దాదాపు 15 కోట్లు. ఈ ఫామ్‌హౌస్‌లో హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్ లాంటి లగ్జరీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. సినిమాలే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో పెట్టుబడి పెట్టి బిజినెస్ ప్రపంచంలోనూ షారుఖ్ తన

త మ బ క వచ చ 12 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in