తుని పాప మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు
Actor ProfilePolitician

తుని పాప మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తుని పాప మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు, అసలు ఏం జరిగింది
Zee Telugu11 Jul 2026
తుని పాప మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు, అసలు ఏం జరిగింది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. High Court Involves In Tuni Girl Missing Case: తుని చిన్నారి మిస్సింగ్ కేసు ఇంకా క్లారిటీకి రాలేదు, పాప ఎక్కడుందో కూడా తెలియరావడం లేదు. దీనిపై ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా, అదృశ్యమైన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను పోలీసులు పాటించారా? లేదా? అని కూడా హైకోర్టు అడిగింది. పాపను కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని లాయర్ శ్రీకాంత్ పిల్‌ వేశారు. అయితే పాప కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసుల తరఫు లాయర్ చెబుతున్నారు. గత 15 రోజులుగా జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.. పాప క్షేమంగా తిరిగి రావాలని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కోరుకుంటున్నారు. పోలీసులు ప్రతిచోటా వెతుకుతున్నా, రెండు వారాలు దాటిపోతున్నా ఇంకా ఏమీ తేలలేదు. కిడ్నాప్ చేశారా?, వన్యమృగాల దాడి జరిగిందా? లేక వేటగాళ్ల వలలో చిక్కుకుందా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏ సమాధానం దొరకలేదు. పైగా పెంపుడు కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాకపోవడంతో మిస్టరీ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంతలో ఈ కేసులో కొందరు జ్యోతిష్యుల పేరుతో వచ్చి, పూజలు చేస్తూ పాప బతికే ఉందని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. పాప క్షేమంగా తిరిగి వస్తుందని రోజుకు ఒకరు ఇష్టం వచ్చినట్లు చెబుతుండటంతో పాప తల్లి చాలా ఇబ్బంది పడుతోంది. పోలీసులు మాత్రం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. మొదట ఆ పాపతో పాటు కుక్క కూడా ఉంది. ఈ మిస్సింగ్ కేసులో ఆ కుక్కను అందరూ కీలకమైన అంశంగా భావిస్తున్నారు. మొదట