తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్
Actor ProfilePolitician

తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్

Total News1
Movie Updates0
Sources1
తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్
Andhra Jyothy14 Jun 2026
తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్ కానున్నట్లు సమాచారం. న్యూఢిల్లీ/కోల్‌కతా, జూన్ 14: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం ఇప్పుడు మరింత ముదిరింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ పార్లమెంటరీ లీడర్‌గా ఉన్న ఆరుసార్లు ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు (రెబెల్) క్యాంపులో చేరారు. ఈ తాజా పరిణామంతో మమతా బెనర్జీ నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న (శనివారం) ఉదయం ఢిల్లీ చేరుకున్న సుదీప్ బందోపాధ్యాయ్, మరో రెబెల్ ఎంపీ శతాబ్ది రాయ్‌తో కలిసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీల్లో ఇప్పటికే 19 మంది ఎంపీలు రెబెల్ క్యాంపులో ఉండగా, సుదీప్ చేరికతో ఆ సంఖ్య 20కి చేరింది. పార్లమెంటులో ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection Law) నుంచి తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ (28 మందిలో 19 మందికి పైగా) ఇప్పుడు ఈ రెబెల్స్ సొంతమైంది. వీరంతా రేపు (సోమవారం) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించి ఎన్‌డీఏ (NDA) కూటమిలో భాగం చేయాలని కోరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ రెబెల్స్ వర్గానికి బారాసత్ ఎంపీ కాకలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, ఆరుసార్లు ఎంపీగా గెలిచిన అత్యంత సీనియర్ నాయకుడైన సుదీప్ బందోపాధ్యాయ్ క్యాంపులోకి రావడంతో, కాకలి స్థానంలో ఆయనే ఈ తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్ కానున్నట్లు

త ణమ ల క గ ర స ర బ ల ఎ ప ల క త త ల డర స ద ప బ ద ప ధ య య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in