తండ్రిగా గర్వంగా ఉన్నా.. నటుడిగా మాత్రం
Actor ProfileActor

తండ్రిగా గర్వంగా ఉన్నా.. నటుడిగా మాత్రం

Total News1
Movie Updates0
Sources1
తండ్రిగా గర్వంగా ఉన్నా.. నటుడిగా మాత్రం
Chitrajyothy14 Jun 2026
తండ్రిగా గర్వంగా ఉన్నా.. నటుడిగా మాత్రం

పొలాచ్చిలో మెగా 158 షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకొచ్చిన చిరు ఇటీవల పెద్ది చిత్రాన్ని వీక్షించారు. తదుపరి చిత్ర బృందం తో ముచ్చటించారు. ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను కొనియాడుతూ చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘పెద్ది’ సినిమాలో పర్టిక్యూలర్‌ సీన్స్‌లో రామ్ చరణ్ నటన చూసి చాలామంది ‘చిరంజీవిని మించి నటుడు' అని, ‘చరణ్‌జీవి’ అని అంటున్నారు. ఆ మాటను తప్పకుండా ఒప్పుకుంటా. తండ్రిగా చాలా గర్వంగా ఉంది కానీ నటుడిగా కాస్త కష్టంగా ఉంది(నవ్వుతూ). బాగా చేశావ్‌ రా చరణ్‌ లవ్‌ యూ’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు చిరంజీవి. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్‌ కిలారు నిర్మించిన ‘పెద్ది’ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. పొలాచ్చిలో షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకొచ్చిన చిరు ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించారు. తదుపరి చిత్ర బృందం తో ముచ్చటించారు. ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను కొనియాడుతూ చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంతో బెస్ట్‌ మూమంట్స్‌ను వివరించారు. ఆ సీన్‌లోనే అర్థమైంది.. ‘ట్రైన్‌ సీన్‌లో చరణ్‌ కాలు పెట్టడానికి ముందు, ఫ్రేమ్‌ లోకి వచ్చినప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ నా ఫేవరెట్‌. కళ్ళు మూసే ముందు శూన్యంలోకి అలా ప్లెయిన్‌గా చూస్తూ సినిమాలో లీనమైపోయాడు. ఆ షాట్‌ చూసినప్పుడే థియేటర్లలో క్లాప్స్‌ పడతాయని నాకు అర్థమైంది. ఈ తరానికి స్ఫూర్తిని ఇవ్వడానికి బుచ్చిబాబు ఈ కథను ఎంచుకోవడం గొప్ప విషయం. ఇప్పుడున్న కార్పొరేట్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌లో కేవలం మార్కులు, ర్యాంకులు తప్ప పిల్లలకి ఫిజికల్‌ యాక్టివిటీ లేకుండా పోయింది. స్కూల్‌ అంటే కేవలం నాలుగు గోడలు, బ్లాక్‌ బోర్డ్‌ కాదు. దాని వెనకాల ప్లే గ్రౌండ్‌ కూడా ఉండాలి. అమ్మ కడుపులో ఉన్న తొమ్మిది నెలలు ఆడుకున్న పిల్లలకు, బయట ప్రపంచంలో