
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత ఆయన ప్రభుత్వ అధికారిక అంతిమ సంస్కారాలకు ఇరాన్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జులై 4న టెహ్రాన్ నుంచి ఈ అంతిమ యాత్ర ప్రారంభమై జులై 9న మషద్‌లో ఖనన కార్యక్రమంతో ముగియనుంది. ఆయన భౌతికకాయాన్ని దేశంలోని పలు ప్రధాన నగరాల గుండా ఊరేగించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ అంతిమ యాత్రలో అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా పాల్గొంటారా లేదా అనే విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాలేదు.ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దళాలు జరిపిన దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేయడంతో ఈ దారుణం జరిగింది. ఈ దాడి అనంతరం ఇరు పక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. ఆ సంక్షోభ సమయంలో అలీ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తమ మాజీ సర్వోన్నత నాయకుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఇరాన్ అధికారులు నిర్ణయించారు. ఈ అంతిమ సంస్కారాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడిలో 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని.. ఆయన ముఖానికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యంపై అంతర్జాతీయంగా అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇరాన్ అధికారులు మాత్రం మొజ్తబా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. తన విధులను సక్రమంగా