తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. 'తల్లికి వందనం' డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
Actor ProfilePolitician

తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. 'తల్లికి వందనం' డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. 'తల్లికి వందనం' డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
10TV Telugu29 Jul 2026
తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. 'తల్లికి వందనం' డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం

'తల్లికి వందనం' డేట్ ఫిక్స్ జులై 10న నిధుల విడుదల. ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి. Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో జులై మూడో వారంలో ఈ నగదును రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అంతకంటే ముందుగానే జులై 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. Shani Trayodashi: రేపే ‘శని త్రయోదశి’.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. ఇలా చేస్తే అనుగ్రహం తప్పనిసరి! ఒక్కొక్కరికి రూ.13 వేలు: ఈ పథకం కింద ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి ఒక్క విద్యార్థికి రూ.13,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అయితే, ఈ నిధులు సకాలంలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే లబ్ధిదారులు ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. తల్లులు, విద్యార్థులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే జులై 10న ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు అందుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నమైంది