
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. K Bhagyaraj:వెటరన్ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. శనివారం చెన్నైలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మరణించే సమయానికి ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో ఒక స్వర్ణయుగానికి ముగింపు పలికిందని సినీ ప్రముఖులు భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. కె. భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జన్మించిన ఆయన సినీ ప్రయాణాన్ని ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా ప్రారంభించారు. అనంతరం తన ప్రతిభతో దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మధ్యతరగతి కుటుంబాల కథలను సహజంగా చూపించడం, బలమైన కథనం, భావోద్వేగాలతో కూడిన సినిమాలు రూపొందించడం ఆయన ప్రత్యేకత. 1980, 1990 దశకాల్లో ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. కెరీర్‌లో 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే 75కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాల్లోని పాత్రలు, కుటుంబ విలువలు, జీవితానికి దగ్గరగా ఉండే కథలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన ముందానై ముడిచ్చు, అంధా 7 నాట్కల్,డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ వంటి చిత్రాలు ఇప్పటికీ తమిళ సినీ చరిత్రలో క్లాసిక్ సినిమాలుగా నిలిచాయి. ఈ సినిమాలు కొత్త తరానికి కూడా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. కె. భాగ్యరాజ్ కుటుంబంలో భార్య, మాజీ నటి పూర్ణిమ భాగ్యరాజ్