తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం
Actor ProfileActor

తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా
Asianet News Telugu19 Aug 2026
తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా

ఫిల్మ్ ఇండస్ట్రీలో మాతృభాష రాని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కి మినహాయింపు ఏమీ లేదు. తెలుగులో స్టార్ డమ్ ఉన్న సగం హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున లాంటి చాలా మంది హీరోలకు తెలుగు చదవడం రాదు. స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ లో రాసుకుంటారు. ఈ హీరోలంతా ఇంగ్లీష్ మీడియం చదవడం.. చెన్నైలో పుట్టి పెరగడం వల్ల చాలా మంది సినిమా తారలకు మాతృభాష చదవడం, రాయడం రాదు. కానీ టాలీవుడ్ లో సహజనటిగా పేరు తెచ్చున్న పాత తరం హీరోయిన్ జయసుధకు కూడా తెలుగు చదవడం రాయడం రాదు అని మీకు తెలుసా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటి అన్న పేరు జయసుధకు మాత్రమే ఉంది. నేచురల్ యాక్టింగ్ తో అద్భుతమైన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది ఈ నటి. జయసుధ మూడు తారాల హీరోలతో కలిసి నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు, మురళీ మోహన్ వరకూ హీరోలతో జంటగా నటించిన జయసుధ.. ఆతరువాత తరం హీరోలకు తల్లిగా, భామ్మగా కూడా నటించి మెప్పించింది. విచిత్రం ఏంటంటే వందల తెలుగు సినిమాలు చేసిన జయసుధకు తెలుగు చదవడం, రాయడం రాదు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించింది. జయసుధ తెలుగు నటి, కృష్ణ సతీమణి విజయ నిర్మలకు చాలా దగ్గర బంధువు. ఆమె అవ్వడానినికి తెలుగు నటే అయినా.. చెన్నైలోనే ఉంటుంది... మద్రాస్ లోనే పుట్టి పెరిగింది. అక్కడే తమిళ , ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది. దాంతో ఆమెకు తమిళం రాయడం, చదవడం వచ్చు. తెలుగు సినిమాలు చేసినా కూడా తెలుగు చదవడం ఆమెకు రాదు. డైలాగ్స్ విని వాటిని గుర్తు పెట్టుకుని యాక్ట్ చేయడం జయసుధకు