తమిళ నటుడు ఆర్య
Actor ProfileActor

తమిళ నటుడు ఆర్య

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
తమిళ నటుడు ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు
10TV Telugu31 Oct 2026
తమిళ నటుడు ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు

Actor Arya : ప్రముఖ తమిళ నటుడు ఆర్య, ‘అనంతన్ కాడు’ చిత్ర బృందంపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణకు విలువైన కెమెరాలు తీసుకొని రూ.1.80కోట్ల బకాయిలు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని హైలాం కాలనీలోని తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ‌కు అకౌంటెంట్ జావేద్ అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బకాయిల కోసం సంప్రదించిన తమ సంస్థ మేనేజర్ ను చిత్ర నిర్మాత వినోద్, హీరో ఆర్య, వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జావేద్ అలీ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘అనంతన్ కాడు’ సినిమా నిర్మాణ సమయంలో హీరో ఆర్య, నిర్మాత వినోద్, నిర్మాన సంస్థ ప్రతినిధులు పలుమార్లు తాహేర్ సినీ టెక్నిక్ సంస్థను సంప్రదించి సినిమా చిత్రీకరణ కోసం అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు, ఇతర పరికరాలు అందించాలని కోరారు. అద్దె మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని పలుసార్లు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 25వ తేదీన ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్ నుంచి కేరళకు విలువైన పరికరాలను సంస్థ సొంత ఖర్చులో తరలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా మొత్తం పూర్తయ్యే వరకు పరికరాలను వినియోగించుకున్నారు. కానీ, ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.2.12కోట్లలో రూ.1.80 కోట్లకుపైగా బకాయిలుచెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయిలు ఉన్నట్లు లిఖితపూర్వకంగా అంగీకరించి, సినిమా విడుదలకు ముందే మొత్తం చెల్లించి ‘నో డ్యూస్‌ సర్టిఫికెట్‌’ తీసుకుంటామని హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదు. బకాయిలు చెల్లించాలని పలు విధాలుగా సంప్రదించినా పట్టించుకోలేదని, దీనికితోడు కేరళలో కోర్టును ఆశ్రయించి వాస్తవాలను దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారని సంస్థ అకౌంటెంట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జావేద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

తమిళ పొలిటికల్ థ్రిల్లర్ లో సునీల్.. అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్
AP7AM16 Jun 2026
తమిళ పొలిటికల్ థ్రిల్లర్ లో సునీల్.. అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్

తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర

తమ ళ నట డ ఆర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in