ఇకపై తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తమిళనాడు రోడ్డు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ వెల్లడించారు. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించడంపై టీవీకే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పార్థీబన్ తెలిపారు. తమిళనాడులోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా బస్సు సౌకర్యం చేరాలన్నది తమ సీఎం లక్ష్యమని ఆయన చెప్పారు. కొత్తగా కొనే ప్రతి బస్సులోనూ ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు ఉండాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలని సీఎం సూచించినట్లు మంత్రి పార్థిబన్ వెల్లడించారు. ‘‘తమిళనాడు ప్రజలు ఏసీ బస్సుల్లో సౌకర్యవంతంగా ప్రయాణించాలని మా ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు’’ అని రాష్ట్రంలోని వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్థిబన్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి విలేకరులతో అన్నారు. ఈ విషయమై ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారని చెప్పారు. ‘త్వరలోనే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారు’’ అని మంత్రి తెలిపారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ వంటి పథకాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, మేనమామ బంగారు ఉంగర పథకం వంటివి తీసుకొచ్చారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. గతవారం మొత్తం 127.21 కోట్ల వ్యయంతో కొనుగోలుచేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను సీఎం ప్రారంభించారు. ఇందులో 164 డీజిల్ బస్సులు
Actor ProfilePolitician
తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•22 Aug 2026
తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీపై సీఎం విజయ్ కీలక నిర్ణయం