
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. ఆయనను మళ్లీ శాసనసభలోకి పంపడమే లక్ష్యంగా సీనియర్ నేతలు అధిష్ఠానంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ అంశం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఒక రేంజ్‌లో ఊపేస్తోంది. ఈ ఉపఎన్నిక రావడానికి గల నేపథ్యం చాలా ఆసక్తికరంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు స్థానాల నుంచి ఘన విజయం సాధించారు. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన ఒక్క స్థానాన్ని మాత్రమే తన వద్ద ఉంచుకోవాల్సి వచ్చింది. దీంతో విజయ్ పెరంబూర్ నియోజకవర్గాన్ని నిలుపుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఇదే సమయంలో డీఎంకే ఊహించని విధంగా ఒక పెద్ద ఎదురుదెబ్బను తిన్నది. స్టాలిన్ తన సుదీర్ఘకాల సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుంచి టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ అనూహ్య ఓటమి ఫలితంగా స్టాలిన్ ప్రస్తుతం శాసనసభకు వెలుపలే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీఎంకే అధినేతగా, ప్రధాన విపక్ష నాయకుడిగా ఉంటూ అసెంబ్లీలో ఆయనకు ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ను తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దించాలనే డిమాండ్ డీఎంకేలో బాగా పెరుగుతోంది. తిరుచ్చి దక్షిణ జిల్లా డీఎంకే కార్యవర్గం ఇప్పటికే దీనిపై ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి పార్టీ అధిష్ఠానానికి పంపింది. మాజీ మంత్రులు కే.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యామొళి వంటి సీనియర్ నేతలు కూడా ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు. నెహ్రూ తన ఇటీవలి వ్యాఖ్యల్లో స్టాలిన్ త్వరలోనే అసెంబ్లీలోకి అడుగుపెడతారని