
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు జిల్లాలోని బారాషాహిద్ రొట్టెల పండుగ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ రొట్టెల పండుగ భక్తుల రద్దీతో వైభవంగా జరిగింది. సుమారు 415ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండుగలో రాష్ట్రం నలుమూలలతోపాటు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. బారాషహీద్ దర్గాను దర్శించుకున్న అనంతరం భక్తులు స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్నికొనసాగిస్తారు. ఆయా కోరికలు కోరుకున్నవారు అప్పటికే ఆ కోరిక నెరవేరిన వారి నుంచి రొట్టెలు తీసుకుంటారు. రొట్టె తీసుకున్నాక తమ కోరిక నెరవేరితే మరుసటి ఏడాది వచ్చి వేరొకరికి రొట్టె ఇస్తుంటారు. మళ్లీ వేరొక కోరిక ఉంటే దానికి సంబంధించిన రొట్టె తీసుకుంటారు. తాజాగా… నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే రొట్టె వదిలారు. ఈ ఏడాది పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వదిలిన ఎమ్మెల్యే రొట్టె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ ఆయనకు ఎమ్మెల్యే రొట్టె అందజేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి సుజిత, కుమార్తె సాయి వైష్ణవి బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టె వదిలారు. ఆ రొట్టెను గిరిధర్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సుజిత మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డిని తమ కుమారుడిలాగే పెంచామని, ఆయన ఎమ్మెల్యే కావాలనేది కుటుంబ సభ్యులందరి ఆకాంక్ష అని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. బారాషహీద్ రొట్టెల పండుగ తమ కుటుంబానికి సెంటిమెంట్ అని, తాను ఎమ్మెల్యే అయిన తరువాత 12వ సారి అధికారికంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తన సోదరుడికి పార్టీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లను కోరారు. రొట్టెల పండుగ విశిష్టత