తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్ .. కేవలం ఇంటీరియర్ కే 3 కోట్లు
Actor ProfileCelebrity

తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్ .. కేవలం ఇంటీరియర్ కే 3 కోట్లు

Total News1
Movie Updates0
Sources1
తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్ .. కేవలం ఇంటీరియర్ కే 3 కోట్లు
Asianet News Telugu17 Jun 2026
తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్ .. కేవలం ఇంటీరియర్ కే 3 కోట్లు

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆమెకి ఆఫర్లు రావడం లేదా? లేక ఆమె చేయడం లేదా? కారణం ఏంటోగానీ తమన్నా తెలుగులో సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్‌ మీడియా ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నా వార్తల్లో నిలిచింది. కొత్తిళ్లు కొన్నది. దీని ధర షాకిస్తోంది. తమన్నా భాటియా ఇటీవలే ముంబాయిలో ఒక అపార్ట్మెంట్‌లో లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేసింది. ఈ ఇల్లు ఏ 5-స్టార్ హోటల్‌కు తక్కువ కాదు. ఇక్కడ అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. తమన్నా ఇల్లు సుమారు 6065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ ప్రత్యేకత ఏంటంటే, అన్ని వైపుల నుంచి సముద్రం కనిపిస్తుంది. మరి ఈ కొత్త ఫ్లాట్‌ ధర ఎంతో తెలిసా, ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ ఫ్లాట్ వెర్సోవా-జుహు లింక్ రోడ్‌లోని 'బే వ్యూ' అనే 22 అంతస్తుల భవనంలో 14వ అంతస్తులో ఉంది. తమన్నా ఈ ఫ్లాట్‌ ను రూ.16.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ కోసమే ఏకేంగా దాదాపు రూ. 2-3 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. తమన్నా ఇంటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పెద్ద ఓపెన్ బాల్కనీ ఉంది. అందులో రకరకాల మొక్కలు నాటారు, అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. బాల్కనీలో ఐదుగురు కూర్చోగలిగే పెద్ద జకుజీ కూడా ఉంది. తమన్నా లివింగ్ రూమ్‌ను తెలుపు, క్రీమ్, నలుపు రంగులతో అలంకరించారు. దీనితో పాటు వెల్వెట్ సోఫాలు, స్టైలిష్ డిజైనర్ కాఫీ టేబుల్, మోడరన్ డెకర్‌ను ఉంచారు. దీంతో ఇది కనువిందుగా ఉంది. అత్యంత లావిష్‌గానూ ఉంది. మొత్తంగా తమన్నా ఈ కొత్తింటిలో లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేయబోతుందని చెప్పొచ్చు