తమన్నా కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఇంటీరియర్ ఖర్చే కోట్లలో
Actor ProfileActor

తమన్నా కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఇంటీరియర్ ఖర్చే కోట్లలో

Total News1
Movie Updates0
Sources1
తమన్నా కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఇంటీరియర్ ఖర్చే కోట్లలో
Zee Telugu17 Jun 2026
తమన్నా కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఇంటీరియర్ ఖర్చే కోట్లలో

Tamannaah Bhatia:దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె సినిమా కోసం కాదు, ముంబైలో కొనుగోలు చేసిన విలాసవంతమైన కొత్త ఇంటి కారణంగా చర్చనీయాంశంగా మారారు. అత్యాధునిక సౌకర్యాలు, సముద్ర అందాలు, లగ్జరీ ఇంటీరియర్‌తో ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని ప్రముఖ వెర్సోవా-జుహు లింక్ రోడ్ ప్రాంతంలో ఉన్న బే వ్యూ అనే ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో తమన్నా ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. 22 అంతస్తుల భవనంలోని 14వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 6,000 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఇంటి ప్రధాన ఆకర్షణ సముద్రాన్ని నేరుగా వీక్షించే అవకాశం. అపార్ట్‌మెంట్‌లోని పలు గదులు, బాల్కనీ నుంచి అరేబియా సముద్రం అందాలు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంటి విలువ సుమారు రూ.16 కోట్లకు పైగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇంటి ఇంటీరియర్ డిజైన్‌కే కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆధునిక శైలి, లగ్జరీ ఫర్నిచర్, ప్రత్యేక అలంకరణలతో ఇంటిని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఓపెన్ బాల్కనీ ఈ ఇంటి హైలైట్‌గా నిలుస్తోంది. పచ్చదనంతో నిండిన ఈ ప్రదేశంలో వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేయడంతో పాటు విశ్రాంతి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. నగర రద్దీకి దూరంగా ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించేలా ఈ స్థలాన్ని రూపొందించినట్లు సమాచారం.లివింగ్ ఏరియాలో తెలుపు, క్రీమ్ షేడ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వగా, ఆధునిక ఫర్నిచర్‌తో ఇంటికి మరింత లగ్జరీ లుక్ తీసుకొచ్చారు. సింపుల్‌గా కనిపించినా, ప్రతి మూలలో క్లాస్ మరియు ఎలిగెన్స్ కనిపించేలా ఇంటీరియర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్న తమన్నా, ఇప్పుడు ఈ