ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్
Actor ProfilePolitician

ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్

Total News1
Movie Updates0
Sources1
ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్
Vaartha15 Jun 2026
ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం, అక్కడి ఉద్యమ పరిస్థితులపై అత్యంత కీలకమైన, భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన జనసేన ‘సేన ప్రస్థానం’ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని వెల్లడించారు. తెలంగాణ నేల, అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. Read also: Telangana schools: మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఆత్మబలిదానాలను పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనతో గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు 1,200 మంది యువతీ యువకులు అమరులైనప్పటికీ, వారి త్యాగాలను గుర్తించడానికి గడచిన 12 ఏళ్లు సరిపోలేదని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ నాయకులు గద్దెనెక్కడానికి, అధికారంలోకి రావడానికి యువతను బలి చేశారు. ఒక నేల కోసం, ఒక ఆశయం కోసం ఇంతలా ఆత్మబలిదానాలు చేసుకుంటారా అనిపించింది. అందుకే నాకు తెలంగాణ అమరవీరులంటే అత్యంత గౌరవం. తెలంగాణ ఉద్యమం నాలో ఎనలేని స్ఫూర్తిని నింపింది, అక్కడి యువత బలిదానాలు నన్ను తీవ్రంగా కదిలించాయి. అని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే క్రమంలో తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరును పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాము నిర్వహించ తలపెట్టిన సమావేశానికి పర్మిషన్ ఇవ్వకుండా నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించారు. అలాగే, గతంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన తీరును తాము మొదటి నుంచీ వ్యతిరేకించామని, ఒక పద్ధతి ప్రకారం విభజన జరగలేదనేదే తమ వాదనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత బలంపై మాట్లాడుతూ.. కేవలం ఒక లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన జనసేన పార్టీ, నేడు