ఢిల్లీ వేదికగా జనసేన బిగ్ స్కెచ్. రేపు కీలక ప్రకటన
Actor ProfilePolitician

ఢిల్లీ వేదికగా జనసేన బిగ్ స్కెచ్. రేపు కీలక ప్రకటన

Total News1
Movie Updates0
Sources1
ఢిల్లీ వేదికగా జనసేన బిగ్ స్కెచ్. రేపు కీలక ప్రకటన
Oneindia Telugu14 Jun 2026
ఢిల్లీ వేదికగా జనసేన బిగ్ స్కెచ్. రేపు కీలక ప్రకటన

భారత రాజకీయాల్లో ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, జాతీయ సమైక్యతకు బలం చేకూర్చే సరికొత్త రాజకీయ సిద్ధాంతాన్ని బలీయంగా వినిపించేందుకు జనసేన సిద్ధమైంది. పార్టీ స్థాపించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అశోక హోటల్‌లో రేపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం అనే పేరు ఖరారు చేశారు. కేవలం ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితం కాకుండా.. దేశ సమగ్రత కోసం ఒక రాజకీయ శక్తిగా ఎలా నిలబడాలనే అంశంపై ఈ వేదిక ద్వారా స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భిన్న భాషలను గౌరవించే సంప్రదాయం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే సంస్కృతులను కాపాడే సమాజం.. ఇవే పునాదులుగా జనసేన గత 12 ఏళ్లుగా ప్రయాణించింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో జాతీయ సమైక్యతను కాపాడటానికి పార్టీ అనుసరించిన వ్యూహాలు, వర్తమాన భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ లోతైన విశ్లేషణ చేయనున్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, దేశ సార్వభౌమాధికారానికి మధ్య ఉండాల్సిన సమతుల్యతను ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించనున్నారు.దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో భారీ క్యాన్వాస్ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇటీవల కాలంలో పార్టీలో చేరిన ముఖ్యులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు ఈ మేధోమథనంలో భాగస్వాములు కానున్నారు. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ భావజాలాన్ని మరింత బలంగా విస్తరించే వ్యూహం కనిపిస్తోంది.తెలంగాణ జనసేన లో చేరికలు మొదలు, మారుతున్న లెక్కలు..!!జాతీయ రాజకీయాలపై దిశానిర్దేశంప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సమైక్యతగా నిలవాల్సిన ఆవశ్యకతను నాయకులకు వివరించడంతో పాటు, భవిష్యత్